తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పోలీసుల ఆకలి తీరుస్తున్న నటుడు ఉత్తేజ్ - movie news

కరోనా కట్టడిలో భాగంగా రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆసరగా నిలుస్తున్నాడు నటుడు ఉత్తేజ్. వారికి ఆహారపొట్లాలు అందజేస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు.

పోలీసుల ఆకలి తీరుస్తున్న నటుడు ఉత్తేజ్
నటుడు ఉత్తేజ్

By

Published : Apr 6, 2020, 5:04 PM IST

కరోనాపై పోరాటంలో భాగంగా నటుడు ఉత్తేజ్, తనవంతు సామాజిక బాధ్యతను చాటుకుంటున్నాడు. ప్రజల ఆరోగ్యం కోసం శ్రమిస్తున్న పోలీసులకు ఆసరగా నిలుస్తున్నాడు. తన నివాస పరిసరాలైన యూసఫ్ గూడ, శ్రీనగర్ కాలనీ, బంజారాహిల్స్, ప్రసాద్ ఐమ్యాక్స్ కూడలిలో విధులు నిర్వహిస్తున్న రక్షకభటుల ఆకలి తీరుస్తున్నాడు. ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకొచ్చి, గత నాలుగు రోజుల నుంచి కుటుంబంతో కలిసి పంపిణీ చేస్తూ, మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. కరోనా వైరస్ తీవ్రత తెలియడం వల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉంటున్నారని చెబుతున్నాడు.

రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్న ఉత్తేజ్

ABOUT THE AUTHOR

...view details