తెలంగాణ

telangana

ETV Bharat / sitara

త్రిష  అందం వెనుకున్న రహస్యం ఇదే! - త్రిష అందం

ఎన్నో ఏళ్లుగా సినీరంగంలో ఉన్న హీరోయిన్ త్రిష... తన అందం వెనకున్న రహస్యాన్ని వెల్లడించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తోందీ భామ.

Actor Trisha reveals the secret behind her beauty
త్రిష  అందం వెనుక రహస్యం ఇదే!

By

Published : Jan 21, 2020, 11:37 AM IST

Updated : Feb 17, 2020, 8:26 PM IST

గత 18 ఏళ్లుగా తన అందంతో అలరిస్తున్న ముద్దుగుమ్మ త్రిష. 'వర్షం', 'అతడు', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా' వంటి చిత్రాలతో ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించింది. దక్షిణాదిలోఇప్పటికే అగ్రహీరోలందరితోనూ దాదాపుగా నటించేసింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ భామ.. తన అందం వెనకున్న రహస్యాన్ని బయటపెట్టింది.

"అందాన్ని కాపాడుకోవడానికి వ్యక్తిగత క్రమశిక్షణ చాలా ముఖ్యం. నేను రోజూ 7-8 గంటలు నిద్రపోతా. వారంలో 4-5 రోజులు వ్యాయామం చేస్తా. సౌందర్య పరిరక్షణకు నాణ్యమైన వస్తువులనే ఉపయోగిస్తా. వీటన్నిటినీ క్రమం తప్పకుండా అనుసరిచడం వల్లే అందాన్ని కాపాడుకోగలుగుతున్నా"

-నటి త్రిష

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో ప్రస్తుతం నటిస్తోందీ భామ. ఇంతకు ముందు 'స్టాలిన్'లో వీరిద్దరూ జంటగా నటించారు. కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి: ఆలియా భట్ రాక కోసం చెర్రీ నిరీక్షణ

Last Updated : Feb 17, 2020, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details