తెలంగాణ

telangana

'అన్నీ కుదిరితే అదే టీమ్​తో మరో సినిమా చేస్తా'

By

Published : Oct 13, 2020, 8:48 PM IST

సినిమాల్లో తన మూడో ఇన్నింగ్స్​ ప్రారంభించబోతున్నట్లు నటుడు తరుణ్​ వెల్లడించారు. తాను నటించబోయే కొత్త ప్రాజెక్టు వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు 'ఈటీవీ-భారత్​'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

Actor Tarun is going to start his third innings
'అన్నీ కుదిరితే 'నువ్వేకావాలి' టీమ్​తో మరో సినిమా చేస్తా'

'అంజలి' చిత్రంతో బాలనటుడిగా తెలుగు ప్రేక్షకులను ​పరిచయమై.. 'నువ్వేకావాలి' చిత్రంతో హీరోగా అలరించారు హీరో తరుణ్​. కథానాయకుడిగా తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. రెండు దశాబ్దాలుగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి 'లవర్​ బాయ్​'గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్​.. గతరెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

తరుణ్​తో ఈటీవీ-భారత్​ ప్రత్యేక ఇంటర్వ్యూ

ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం 'నువ్వేకావాలి' విడుదలై మంగళవారంతో 20 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తన మూడో ఇన్నింగ్స్​ మొదలుపెట్టబోతున్నట్లు 'ఈటీవీ-భారత్​'కు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని.. వచ్చే ఏడాది జనవరిలో తన పుట్టినరోజున దానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. అన్నీ కుదిరితే 'నువ్వేకావాలి' చిత్రబృందంతో మరోసారి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తరుణ్​ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details