తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఐటీ దాడులపై మంత్రి సాయం కోరిన తాప్సీ బాయ్​ఫ్రెండ్ - movie news

ప్రస్తుతం సెన్సేషన్​గా మారిన ఐటీ దాడుల విషయమై కేంద్రమంత్రి కిరణ రిజుజు సాయం కోరారు తాప్సీ బాయ్​ఫ్రెండ్ మథియాస్ బో. దీనికి ఆయన కూడా ప్రతి స్పందించారు. ప్రస్తుతం ఈ సంభాషణ వైరల్​గా మారింది.

Actor Taapsee Pannu's Boyfriend Tweets Union Minister
తాప్సీ బాయ్​ఫ్రెండ్

By

Published : Mar 6, 2021, 11:56 AM IST

బాలీవుడ్‌ నటి తాప్సీ ఇంటిపై ఐటీ దాడులు జరగడం వల్ల ఆమె ప్రియుడు మథియాస్‌ బో గందరగోళానికి గురయ్యారు. దీంతో ఆయన సోషల్‌మీడియా వేదికగా మంత్రి కిరణ్‌ రిజిజును సాయం కోరుతూ ట్వీట్‌ చేశారు.

2018లో మూసివేసిన ఫాంటమ్‌ ఫిలిమ్స్‌ పన్ను ఎగవేత కేసులో బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌తోపాటు ఆయన భాగస్వాముల నివాసాలు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు రెండు రోజుల క్రితం దాడులు చేశారు. ఈ క్రమంలోనే తాప్సీ ఇంటిపై కూడా దాడులు జరిగాయి.

ఐటీ దాడులను ఉద్దేశిస్తూ తాప్సీ ప్రియుడు మథియాస్‌ బో ఓ ట్వీట్‌ పెట్టారు. 'ఏదో తెలియని గందరగోళానికి గురవుతున్నాను. మొట్టమొదటిసారి భారత్‌కు చెందిన గొప్ప క్రీడాకారులకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాననే సంతోషంలో ఉండగానే.. తాప్సీ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయని తెలిసి కాస్త ఇబ్బందికి లోనయ్యాను. ఈ దాడుల వల్ల ఆమె కుటుంబం ముఖ్యంగా తల్లిదండ్రులు ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు. కిరణ్‌ రిజిజు సర్‌.. దయచేసి ఏదైనా చేయండి" అని బో ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌పై స్పందించిన రిజిజు.. 'చట్టానికి అందరూ అతీతులే. ఈ విషయం మనిద్దరి పరిధిలో లేనిది. మన వృత్తిపరమైన బాధ్యతలను మరింత మెరుగ్గా నిర్వర్తిద్దాం" అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ సందేశం వైరల్‌గా మారింది.

డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడైన మథియాస్‌.. గత కొన్ని సంవత్సరాల నుంచి తాప్సీతో రిలేషన్‌లో ఉన్నారు. పలు సందర్భాల్లో ఆమెతో దిగిన ఫొటోలనూ ఆయన సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల వీరిద్దరూ కలిసి మాల్దీవులకూ వెళ్లి వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details