తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనా కట్టడికి సూర్య ఫ్యామిలీ రూ.కోటి విరాళం - సీఎం స్టాలిన్​ను కలిసిన సూర్య ఫ్యామిలీ

కరోనా కట్టడిలో భాగంగా తమిళనాడు ప్రభుత్వానికి అండగా నిలిచారు కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తి. వీరి కుటుంబం తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1 కోటి విరాళం ప్రకటించింది.

Actor Suriya family donated Rs 1 crore to Corona relief fund
కరోనా కట్టడికి సూర్య, కార్తి రూ.కోటి విరాళం

By

Published : May 13, 2021, 12:37 PM IST

కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు సెలబ్రిటీలు. వారికి తోచిన సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. తాజాగా కోలీవుడ్ హీరోలు సూర్య, కార్తి కూడా బాధితులకు అండగా నిలిచారు. తమిళనాడు ప్రభుత్వ సహాయనిధికి వీరి కుటుంబం రూ. 1 కోటి విరాళం ప్రకటించింది. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి స్టాలిన్​ను కలిసిన వారు ఆయనను సత్కరించి.. ఈ సాయం అందజేశారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం చేయాలని అభ్యర్థించారు.

స్టాలిన్​ని కలిసిన సూర్య ఫ్యామిలీ

సూర్య ఈ ఏడాది 'ఆకాశం నీ హద్దురా' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ అందుకుంది. ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు సూర్య. అలాగే 'సుల్తాన్' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు కార్తి. ఈ సినిమా కూడా విజయం సాధించింది. ప్రస్తుతం 'సర్దార్'​, 'పొన్నియన్ సెల్వన్' చిత్రాలతో బిజీగా ఉన్నారు కార్తి.

ABOUT THE AUTHOR

...view details