అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'పుష్ప'. రష్మిక కథానాయిక. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ నటుడు సునీల్‌ని ఎంపిక చేశారు. ఇటీవలే ఆయన చిత్రీకరణలో పాల్గొన్నట్టు సమాచారం.
'పుష్పరాజ్' కోసం సునీల్! - పుష్ప చిత్రంలో హీరో సునీల్
స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమాలోని ఓ కీలకపాత్ర కోసం నటుడు సునీల్‌ను ఎంపిక చేశారని సమాచారం. ఇటీవలే ఆయన చిత్రీకరణలోనూ పాల్గొన్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
!['పుష్పరాజ్' కోసం సునీల్! Actor Sunil to play negative role in Allu Arjun's Pushpa movie?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9974202-thumbnail-3x2-sunil-hd.jpg)
'పుష్పరాజ్' కోసం సునీల్!
ఇందులో ప్రధాన ప్రతినాయకుడి పాత్ర కోసం మొదట పలువురి పేర్లు వినిపించాయి. అందులో సునీల్ పేరూ ఉంది. మరి ఆయన్ని ఏ పాత్ర కోసం ఎంపిక చేశారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో సునీల్‌పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:బాక్సాఫీసును గెలవాలని.. అదృష్టాన్ని పరీక్షించుకోవాలని!