నటుడు సునీల్.. తన సినీ కెరీర్‌ను హాస్యనటుడిగా ప్రారంభించాడు. కొన్నాళ్లకు హీరోగానూ అలరించాడు. ప్రస్తుతం మళ్లీ హాస్యభరిత, సహాయ పాత్రల్లో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు మరో కొత్త అవతారంలో కనిపించనున్నాడు. 'కలర్ ఫొటో' పేరుతో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో విలన్‌గా సందడి చేయనున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను హీరో నాని ఆదివారం విడుదల చేశాడు.
హాస్య నటుడు.. హీరో.. ఇప్పుడు విలన్‌గా సునీల్ - tollywood news
నటుడు సునీల్.. 'కలర్‌ఫొటో' సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు సందీప్ రాజ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.
![హాస్య నటుడు.. హీరో.. ఇప్పుడు విలన్‌గా సునీల్ విలన్‌గా కనిపించనున్న సునీల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5527349-556-5527349-1577604252303.jpg)
నటుడు సునీల్
ఇందులో సుహాస్, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సునీల్ విలన్‌గా నటించనున్నాడనే విషయాన్ని ఈ డైరెక్టర్.. ట్విట్టర్లో పంచుకున్నాడు. ఈ చిత్రానికి కీరవాణి కొడుకు కాలభైరవ సంగీతమందిస్తున్నాడు. సాయిరాజేశ్, బెన్ని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇది చదవండి:సినిమా టికెట్ కొన్న తర్వాతే బ్రష్ చేసేవాడిని: సునీల్