'వేదాంతం రాఘవయ్య'గా హాస్యనటుడు సునీల్
హాస్యనటుడు సునీల్ మరోసారి హీరోగా నటించనున్నారు. 'వేదాంతం రాఘవయ్య' సినిమాలో విభిన్న పాత్రతో అలరించనున్నారు. దీనికి దర్శకుడు హరీశ్ శంకర్ కథ అందించారు.
నటుడు సునీల్
ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్.. సునీల్ కోసం ఓ కథను సిద్ధం చేశారు. అతడు కథానాయకుడుగా నటించబోయే ఆ సినిమాకు 'వేదాంతం రాఘవయ్య' అనే టైటిల్ పెట్టారు. దీనిని హరీశ్ శంకర్ సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు, హీరోయిన్, సాంకేతిక వర్గ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ రాఘవయ్య ఎలా ఉంటాడో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. మరోవైపు పవన్ కల్యాణ్ కొత్త చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు హరీశ్.
Last Updated : Aug 31, 2020, 4:39 PM IST