తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పుష్ప' అప్డేట్​.. మాస్​లుక్​లో భయపెడుతున్న సునీల్​ - అల్లుఅర్జున్​ రష్మిక

'పుష్ప'(pushpa sunil first look) సినిమాలో విలన్​గా నటిస్తున్న సునీల్​ ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్​లో సునీల్​.. సరికొత్త అవతారంలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.

sunil
సునీల్​

By

Published : Nov 7, 2021, 10:23 AM IST

Updated : Nov 7, 2021, 10:48 AM IST

'పుష్ప'(pushpa sunil first look) సినిమా నుంచి కొత్త అప్డేట్​ వచ్చేసింది. ఇందులో మంగళం శ్రీను అనే విలన్​ పాత్రలో నటిస్తున్న సునీల్​కు సంబంధించిన ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. "రాక్షసుడి పరిచయం.. మంగళం శ్రీనుగా సునీల్‌" అని వ్యాఖ్య రాసుకొచ్చింది. ఎప్పుడూ కనిపించని సరికొత్త అవతారం మాస్​లుక్​లో​ కనిపించి అభిమానులను భయపెట్టారు సునీల్. నుదుటన బొట్టు, మెడలో చైన్​లు,​ చేతిలో పాత మొబైల్​ ఫోన్​, ఎరుపెక్కిన కళ్లతో ఉన్న ఆయన సీరియస్​ లుక్​ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఈ పోస్టర్​ చూసిన నెటిజన్లు "వామ్మో.. సునీల్‌ భయ్యా.. ఏంటి ఇది..!" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌(sukumar alluarjun movie) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నీ పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక సందడి చేయనున్నారు(alluarjun rashmika movie). ప్రతినాయకుడిగా మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. 'పుష్ప ది రైజ్‌' పేరుతో మొదటి భాగాన్ని డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇదీ చూడండి: అల్లు అర్జున్ 'పుష్ప'.. మరో వారం రోజులే..!

Last Updated : Nov 7, 2021, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details