ప్రాణకోటి జీవనాధారానికి అవసరమైన ఆక్సిజన్ కోసం ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటాలని ప్రముఖ హాస్యనటుడు సునీల్ కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటుడు రాజా రవీంద్ర విసిరిన హరిత సవాల్‌ను స్వీకరించిన సునీల్.. జూబ్లీహిల్స్‌లోని పార్క్‌లో మొక్కలు నాటారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సునీల్ - మొక్కలు నాటిన సునీల్
ప్రముఖ హాస్యనటుడు సునీల్ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. జూబ్లిహిల్స్‌లోని పార్క్‌లో మొక్కలు నాటారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సునీల్
ఈ సందర్భంగా పెద్దల మాటలను గుర్తుచేసిన సునీల్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మరింత ఉద్ధృతంగా నిర్వహించి దేశాన్ని పచ్చటి వనంలాగా తీర్చిదిద్దాలని కోరారు. అందులో భాగంగా ప్రముఖ నటి సురేఖ వాణితోపాటు 'కలర్ ఫొటో' చిత్రబృందానికి మొక్కలు నాటాలని సునీల్ హరిత సవాల్ విసిరారు.