టాలీవుడ్ కథానాయకుడు సుమంత్ హీరోగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కపటధారి'. ఈ సినిమాలో కథానాయికగా నందితా శ్వేత నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను హీరో రానా సోషల్‌మీడియా వేదికగా గురువారం విడుదల చేశాడు. 'ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు.. అన్నింటికీ కారణముంటుంది' అని హీరో సుమంత్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమయ్యే టీజర్ ఆద్యంతం సస్పెన్స్‌తో సాగుతోంది. ఓ ట్రాఫిక్ పోలీసు క్రైమ్ దర్యాప్తులో పాల్గొంటాడా? లేదా? అనే విషయం ఆసక్తిగా ఉంది.
'ఏదీ ఊరికే జరగదు.. అన్నింటికీ కారణం ఉంటుంది' - సుమంత్ వార్తలు
సుమంత్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'కపటధారి'. ఈ సినిమా టీజర్‌ను సోషల్‌మీడియాలో విలక్షణ నటుడు రానా విడుదల చేశాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్ర టీజర్ ఆద్యంతం ఉత్కంఠతో ఆకట్టుకుంటోంది.
'ఏదీ ఊరికే జరగదు..అన్నింటికీ కారణం ఉంటుంది'
ఈ చిత్రంలో సుమంత్ ట్రాఫిక్ పోలీస్ అధికారిగా కనిపించిన పోస్టర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంటోంది. సుమంత్ సీరియస్ లుక్‌తో పాటు ఆర్టికల్ 352, ఎఫ్.ఐ.ఆర్.. వంటి ఆంగ్ల పదాలు, పుర్రె గుర్తుతో టైటిల్ లోగోను డిజైన్ చేయడం వల్ల వైవిధ్యంగా కనిపిస్తోంది. ఇందులో నాజర్, వెన్నెల కిశోర్ తదితరులు నటిస్తున్నారు. సైమన్ కె. కింగ్ సంగీత స్వరాలు అందిస్తున్నాడు.