తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వాళ్లు చూడ్డానికే అలా ఉంటారు: సుబ్బరాజు - మహేశ్

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మహేశ్‌బాబు, ప్రభాస్‌ తెరవెనుక ఎలా ఉంటారనే విషయాన్ని ప్రముఖ నటుడు సుబ్బరాజు వెల్లడించారు. ఆయన మహేశ్‌బాబుతో పాటు ప్రభాస్‌తోనూ పలు సినిమాల్లో నటించారు. కాగా.. ఇటీవల ఓ క్లబ్‌హౌస్‌ సెషన్‌లో భాగంగా సుబ్బరాజు పలు విషయాలు పంచుకున్నారు.

mahesh and prabhas
తెర వెనుకు ఎలా ఉంటారంటే

By

Published : Jun 18, 2021, 7:53 AM IST

ఎన్ని సినిమాల్లో చూసినా సినిమా హీరోల అసలు వ్యక్తిత్వం ఏంటో మనకు తెలిసే అవకాశం చాలా తక్కువే. వాళ్లు ఒక్కో సినిమాలో ఒక్కోరకమైన పాత్ర పోషిస్తుంటారు. వాళ్ల అసలైన వ్యక్తిత్వం వాళ్లను ఎంతో దగ్గరగా చూసినవాళ్లకే తెలుస్తుంది. కవర్‌ పేజీని చూసి పుస్తకాన్ని అంచనా వేయొద్దనే సామెత కూడా ఉంది కదా! అయితే.. మన టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మహేశ్‌బాబు, ప్రభాస్‌ తెరవెనుక ఎలా ఉంటారనే విషయాన్ని ప్రముఖ నటుడు సుబ్బరాజు వెల్లడించారు. ఆయన మహేశ్‌బాబుతో పాటు ప్రభాస్‌తోనూ పలు సినిమాల్లో నటించారు. కాగా.. ఇటీవల ఓ క్లబ్‌హౌస్‌ సెషన్‌లో భాగంగా సుబ్బరాజు పలు విషయాలు పంచుకున్నారు.

చాలా కచ్చితత్వం..

సూపర్ స్టార్​ మహేశ్ బాబు

"మహేశ్‌బాబు చూడటానికి చాలా సున్నితంగా కనిపిస్తారు. కానీ.. ఆయన చాలా కచ్చితత్వం ఉన్న మనిషి. ప్రతి విషయంలోనూ ఆయన స్పష్టతను కోరుకుంటారు. ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారం చేయాలంటారు" అని సుబ్బరాజు తెలిపారు.

సున్నితమైన వ్యక్తిత్వం..

రెబల్ స్టార్ ప్రభాస్

"ఇక ప్రభాస్‌ గురించి చెప్పాలంటే ఆయన చూడటానికి కఠినంగా కనిపించినా.. ఆయన చాలా సున్నితమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి. చాలా మంచి మనిషి. ప్రభాస్‌తో కలిసి పనిచేయడం సరదాగా అనిపిస్తుంది" అని సుబ్బరాజు అన్నారు.

సుబ్బరాజు మహేశ్‌ బాబుతో కలిసి 'పోకిరి', 'దూకుడు', 'శ్రీమంతుడు'తో పాటు పలు చిత్రాల్లో నటించారు. ప్రభాస్‌ కెరీర్‌లో మంచి హిట్‌ చిత్రాలుగా నిలిచిన 'మిర్చి', 'బాహుబలి' చిత్రాల్లో సుబ్బరాజు కనిపించారు.

ఇదీ చదవండి :Shooting Resume: తమిళ హీరోల మకాం అక్కడే!

ABOUT THE AUTHOR

...view details