తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నయా 'పెళ్లిసందడి'లో శ్రీకాంత్‌? - రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'పెళ్లిసందడి' సినిమా

రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందనున్న 'పెళ్లిసందడి' సినిమాలో నటుడు శ్రీకాంత్​ కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇందులో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్‌ నటించనున్నారు.

Actor Srikanth
శ్రీకాంత్

By

Published : Dec 9, 2020, 7:37 AM IST

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చి విజయవంతమైన చిత్రాల్లో 'పెళ్లిసందడి'కి ఓ ప్రత్యేక స్థానముంది. శ్రీకాంత్‌ హీరోగా పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం.. అప్పట్లో బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడా క్లాసిక్‌ చిత్ర టైటిల్‌తోనే శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా రాఘవేంద్రరావు ఓ చిత్రాన్ని ఇటీవల ప్రకటించారు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందనున్న ఈ చిత్రాన్ని.. కొత్త దర్శకురాలు గౌరి రోనక్‌ తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు.

అయితే ఈ చిత్రంలో శ్రీకాంత్‌ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఆయన పాత్ర నిడివి కొద్దిసేపే అయినా.. కథను మలుపు తిప్పే పాత్రలో ఆయన కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..ఆయన కనిపించబోయే సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఉండనున్నాయట. త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఇందులో రోషన్‌కు జోడీగా కనిపించబోయే నాయిక కోసం వేట ముమ్మరం చేసింది చిత్ర బృందం. ఈ చిత్రాన్ని జనవరి నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి :'పెళ్లిసందడి'తో హీరోగా కె.రాఘవేంద్రరావు!

ABOUT THE AUTHOR

...view details