లాక్డౌన్లో వలసకూలీలకు సాయం చేసి, వారి పాలిట దైవంగా మారాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. గురువారం(జులై 30) సోనూ పుట్టినరోజు సందర్భంగా సూరత్‌లోని ఆయన అభిమానులు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
చీరపై సోనూసూద్ చిత్రం

గుజరాత్‌లోని సూరత్ చీరలకు ప్రసిద్ధి. సోనూసూద్ వలసకూలీలకు చేసిన సాయాన్ని తెలుపుతూ, ఓ ఫొటోను చీరపై ముద్రించారు. 'ఏదైనా ప్రాంతంలో చిక్కుకుపోయి, ఇంటికి వెళ్లానుకునే వారు సోనూభాయ్కు చెప్పాలి' అనే నినాదాన్ని దానిపై రాశారు. లాక్డౌన్ అమల్లో ఉండటం వల్ల సోనూ ఫొటోను ప్రింట్ చేసిన మాస్క్‌లు ధరించి వేడుకను చేసుకున్నారు. దీనిని వీడియోకాల్ ద్వారా వీక్షించిన సోనూ.. వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
కష్టానికి సాయం అనే మందు
లాక్డౌన్లో వలసకూలీలను స్వస్థలాలకు చేర్చడం దగ్గర నుంచి నిరుపేద రైతులు, నిరుద్యోగులకు సాయం చేయడం సహా ఎన్నో మంచిపనులు చేస్తున్నారు. సినిమాల్లో అతడి నటనకు అభిమానులు కాకపోయినా.. నిజజీవితంలో మాత్రం సోనూ గుండెల్లో పెట్టుకుంటున్నారు.