కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు బోర్డు పరీక్షలు నిర్వహించాలనుకోవడం సరికాదని అన్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. 'క్యాన్సిల్ బోర్డ్ ఎగ్జామ్స్'కు తాను మద్దతుగా నిలుస్తున్నానని తెలిపారు.
ప్రస్తుత తరుణంలో సీబీఎస్ఈ ఆఫ్లైన్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవం సరైనది కాదని చెప్పిన ఆయన.. విద్యార్థులు కూడా ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా లేరని అన్నారు. ఒకవేళ వారు పరీక్షలకు హాజరైతే కరోనా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఆఫ్లైన్ పద్ధతి ద్వారా కాకుండా ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా వారిని ప్రమోట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.