తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పండ్లు అమ్ముతున్న 'డ్రీమ్​గర్ల్' నటుడు - డ్రీమ్​గర్ల్ నటుడు సోలంకి దివాకర్

నటుడు సోలంకి దివాకర్.. డబ్బుల్లేక పండ్లు అమ్ముతున్నాడు. ఇటీవలే వచ్చిన 'డ్రీమ్​గర్ల్'లో ఇతడు నటించాడు. అయితే రోజువారీ ఖర్చులు, ఇంటి అద్దె చెల్లించేందుకే ఇలా చేస్తున్నానని తెలిపాడు.

పండ్లు అమ్ముతున్న 'డ్రీమ్​గర్ల్' నటుడు
నటుడు సోలంకి దివాకర్

By

Published : May 26, 2020, 12:57 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా పనుల్లేకపోవడం వల్ల సినీ పరిశ్రమకు చెందిన నటులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలామంది నటీనటులు కుటుంబపోషణ కోసం చిన్నచిన్న వృత్తులను చేపడుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌కు చెందిన సోలంకి దివాకర్, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పండ్లు అమ్ముతున్నాడు. ఇతడు ఆయుష్మాన్‌ ఖురానా నటించిన 'డ్రీమ్‌గర్ల్‌'లో చిన్న పాత్రలో కనిపించాడు దివాకర్‌. ఆయన ప్రస్తుతం దిల్లీలోని ఓ మార్కెట్‌లో మామిడి పండ్లు అమ్ముతున్నాడు.

దిల్లీలో పండ్లు అమ్ముతున్న నటుడు సోలంకి దివాకర్

'నటన అంటే నాకు ఎంతో ఇష్టం. 'డ్రీమ్‌గర్ల్‌'లో చిన్నపాత్రలో కనిపించినప్పటికీ ప్రేక్షకులను అలరించాను. అలాగే రిషీ కపూర్‌ ఆఖరి చిత్రం 'శర్మాజీ నంకిన్‌'లో పుచ్చకాయల వ్యాపారి పాత్రలో కనిపించాల్సి ఉంది. రిషీ కపూర్‌తో కొన్ని డైలాగులు ఉన్నాయి. ఇప్పటికే మూడుసార్లు ఆ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. ఇంతలో ఆయన మృతి చెందారు. సినిమా షూటింగ్‌ ఇక లేనట్లే. ఇలా ఓ మంచి అవకాశం చేజారిపోయింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా పనుల్లేక పోవడం వల్ల ఇంటి అద్దె కట్టడానికి, నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి, నా దగ్గర డబ్బుల్లేవు. అందుకే పండ్లు అమ్ముతున్నా' అని సోలంకి దివాకర్‌ తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details