ప్రముఖ సినీ నటుడు కిక్ శ్యామ్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. కోడంబాక్కంలో పోకర్ క్లబ్ నడుపుతోన్న ఇతడు.. గ్యాంబ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా పేకాట, బెట్టింగులు నిర్వహిస్తుండటం వల్ల కేసు నమోదు చేశారు.
ప్రముఖ నటుడు 'కిక్' శ్యామ్ అరెస్ట్ - Actor Shaam arrested for involving in Illegal gambling activities
ప్రముఖ నటుడు శ్యామ్‌ను గ్యాంబ్లింగ్ కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. 'కిక్' సినిమాతో తెలుగునాట ఇతడు గుర్తింపు తెచ్చుకున్నాడు.
నటుడు శ్యామ్
తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన శ్యామ్.. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో కిక్, ఊసరవెల్లి ,రేసుగుర్రం, కిక్- 2 చిత్రాల్లో నటించాడు. ఎక్కువగా దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాల్లో కనిపించాడు. 'కిక్'లో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించి, టాలీవుడ్లో కిక్ శ్యామ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Last Updated : Jul 28, 2020, 2:36 PM IST