సినిమా విడుదలకు ముందు సాధారణంగా హీరో లేదంటే హీరోయిన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తుంటారు చిత్రబృందం. దానికి భిన్నంగా అందరికంటే ముందు విలన్ తొలిరూపును అభిమానులతో పంచుకుంది 'కేజీఎఫ్-2' చిత్రబృందం. అందరూ అనుకున్నట్లే ఈ పాత్ర సంజయ్ దత్‌నే వరించింది. ఈ లుక్‌తో అభిమానుల్ని భయపెట్టేందుకు సిద్ధమవుతున్నాడీ బాలీవుడ్ నటుడు. యష్, శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఫస్ట్‌లుక్: కేజీఎఫ్-2లో విలన్‌గా సంజయ్ - సంజయ్ దత్
'కేజీఎఫ్-2'లో ప్రతినాయకుడు 'అధీరా'గా సంజయ్‌దత్ కనిపించనున్నాడు. అతడి పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం.
సంజయ్ దత్.. విలన్ 'అధీరా' పాత్రలో
తొలిభాగంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ప్రశాంత్ నీల్ రెండో భాగానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పేరుకు దక్షిణాది సినిమా అయినా దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించింది కేజీఎఫ్. ఈ చిత్ర సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇది చదవండి: కేజీఎఫ్-2లో 'అధీరా'గా సంజయ్ దత్..!
Last Updated : Jul 29, 2019, 2:15 PM IST