Salman Khan Snake bite: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ పాముకాటుకు గురయ్యారు. కొన్నిరోజులుగా సల్మాన్ తన కుటుంబానికి దూరంగా పాన్వేల్‌లోని ఫాంహౌస్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఆయన్ని పాము కరిచింది. దీంతో, సల్మాన్ వ్యక్తిగత సిబ్బంది వెంటనే ఆయన్ని ముంబయిలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. విషం లేని పాము కాటువేయడం వల్ల ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు.
పాము కాటుకు గురైన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ - ఆస్పత్రిలో సల్మాన్ ఖాన్
Salman Khan Snake bite: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాముకాటుకు గురయ్యారు. ప్రస్తుతం ముంబయిలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
salman Khan
సోమవారం సల్మాన్ ఖాన్ పుట్టినరోజు. అందుకే ఫామ్ హౌజ్‌లో వేడుకలు చేసుకునేందుకు భాయ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. కానీ హఠాత్తుగా ఈ పరిణామం చోటు చేసుకోవడం వల్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి: అనుష్కతో నవీన్ పొలిశెట్టి.. సినిమా ఫిక్స్
Last Updated : Dec 26, 2021, 2:05 PM IST