ఆంగ్లేయులు ఆయనను రైళ్లోంచి గెంటేస్తే.. వారిని దేశం నుంచే గెంటేసిన రియల్ హీరో గాంధీ అని సినీనటుడు సాయికుమార్ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చినా.. ప్రజా సేవకే అంకితమైన ప్రజా నాయకుడంటూ కొనియాడారు. నేడు మహాత్మాగాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని ఆయనను స్మరించుకున్నారు.
ది రియల్ హీరో మహాత్మా గాంధీ: సాయికుమార్ - గాంధీపై హీరీ సాయికుమార్ స్పీచ్
మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా సినీనటుడు సాయికుమార్ ఆయనను స్మరించుకున్నారు. గాంధీ అడుగు జాడల్లో నడవడమే.. మనం మహాత్ముడికిచ్చే నిజమైన నివాళి అన్నారు.
ది రియల్ హీరో మహాత్మా గాంధీ: సాయికుమార్
గాంధీ అంటే అచ్చమైన ఖాదీ.. గాంధీ అంటే స్వచ్ఛమైన ఆజాదీ.. గాంధీ అంటే నిత్య, సత్య శోధన.. గాంధీ అంటే ఆ శ్రీకృష్ణ గీతా బోధన అంటూ తనదైన రీతిలో వర్ణించారు. గాంధీ ఈ తెలుగు నేలపై జన్మించడం మనకు గర్వకారణమన్నారు. అలాంటి ఆదర్శమూర్తికి మనం ఏమివ్వగలం.. ఆయన అడుగు జాడల్లో నడవడం తప్ప అంటూ అభివర్ణించారు.