తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఖాళీ విమానంలో మాధవన్ ఒంటరిగా.. ఎందుకంటే? - మాధవన్

ప్రముఖ నటుడు మాధవన్,​ సింగిల్​గా ఓ విమానంలో దుబాయ్​కు వెళ్లారు. ఆ దృశ్యాలను ఇన్​స్టాలో షేరు చేశారు ఇంతకూ ఆయన ఖాళీ విమానంలో ఎందుకు వెళ్లినట్లు?

R.Madhavan
ప్రముఖ నటుడు మాధవన్

By

Published : Aug 12, 2021, 5:30 AM IST

ప్రముఖ నటుడు ఆర్.మాధవన్.. తన ఇన్​స్టా​లో షేర్​ చేసిన వీడియోలు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.. అవును ఇటీవల మాధవన్.. 'అమ్రికీ పండిట్' సినిమా షూటింగ్​లో పాల్గొనేందుకు దుబాయ్​ వెళ్లారు. అయితే ఆయన ప్రయాణించిన విమానంలో ఆయన తప్ప ఎవ్వరూ లేరు. ఫ్లైట్​ అంతా ఖాళీ. కొవిడ్​ మహమ్మారి కారణంగా ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉన్నారు. దీంతో విమానంలో ఒక్కరు కూడా లేరు.

ఇలాంటి జర్నీ మొదటిసారి

ఈ దృశ్యాలను తన ఇన్​స్టాలో మాధవన్ పోస్ట్ చేశారు. ఇలాంటి విమాన ప్రయాణం తన జీవితంలో ఎప్పుడూ చేయలేదని అన్నారు.

"2021 జులై 26 బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితులు మారాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. మళ్లీ ప్రజలు.. తమ ప్రియమైన వాళ్లను కలవాలని కోరుకుంటున్నా" అని మాధవన్ పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. ఈ పోస్ట్​పై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మాధవన్.. విమానం కొన్నారా? అని కొంతమంది కామెంట్స్ చేశారు. కరోనా మహమ్మారి అంతం కావాలని మరికొంతమంది కామెంట్స్ పెట్టారు.

ఇటీవల 'మారా'తో ప్రేక్షకుల్ని పలకరించారు మాధవన్​. దుల్కర్​ సల్మాన్​ 'చార్లీ' సినిమాకు రీమేక్​గా దీనిని తెరకెక్కించారు. తొలిసారి దర్శకుడిగా మారి రూపొందించిన 'రాకెట్రీ' విడుదల కావాల్సి ఉంది.

ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. మరోవైపు 'అమ్రికీ పండిట్' సినిమాలోనూ కీలక పాత్ర చేస్తున్నారు మాధవన్.

ఇదీ చదవండి:నటుడు మాధవన్​ను వరించిన డాక్టరేట్

ABOUT THE AUTHOR

...view details