కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించమని చెప్పినందుకు నటుడు రియాజ్ ఖాన్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అనంతరం ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడీ నటుడు.
ఇంతకీ ఏం జరిగింది?
కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించమని చెప్పినందుకు నటుడు రియాజ్ ఖాన్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అనంతరం ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడీ నటుడు.
ఇంతకీ ఏం జరిగింది?
తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు పాత్రల్లో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నాడు రియాజ్ ఖాన్. ప్రస్తుతం కుటుంబంతో కలిసి చెన్నైలో ఉంటున్నాడు. బుధవారం ఉదయం సముద్రతీరానికి వ్యాయామం చేసేందుకు వెళ్లాడు. అక్కడ ఓ చోట కొంతమంది గుంపుగా చేరి ముచ్చటించుకుంటున్నారు.
కరోనా తీవ్రత పెరుగుతుండటం వల్ల మనుషుల మధ్య దూరం పాటించాలని రియాజ్ వారికి చెప్పాడు. కొంతమంది అతడిపై తిరగబడ్డారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. గుంపులోని ఒకరు ఈ నటుడిపై దాడి చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు.