'మ్యాన్ వర్సెస్ వైల్డ్' చిత్రీకరణలో రజనీకి గాయాలు! - మ్యాన్ వర్సెస్ వైల్డ్
!['మ్యాన్ వర్సెస్ వైల్డ్' చిత్రీకరణలో రజనీకి గాయాలు! Actor Rajinikanth](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5876526-253-5876526-1580231195460.jpg)
21:20 January 28
'మ్యాన్ వర్సెస్ వైల్డ్' చిత్రీకరణలో రజనీకి గాయాలు!
ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డిస్కవరీ ఛానెల్లో ప్రసారమయ్యే 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' టీవీ షో కోసం రజనీ, బ్రిటన్ సాహసవీరుడు బేర్‌గ్రిల్స్‌తో బందీపూర్ అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ క్రమంలో తలైవాకు చిన్నపాటి గాయాలైనట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన సురక్షితంగా ఉన్నారని.. ఇంటికి చేరుకున్నారని రజనీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రేపటి షూటింగ్‌కు అనుమతి నిరాకరించినట్లు అటవీ అధికారులు వెల్లడించారు.
గతేడాది 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' టీవీ షోలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ అటవీ ప్రాంతంలో బేర్ గ్రిల్స్‌తో కలిసి మోదీ కలియతిరిగారు. మోదీతో చేసిన ఈ షో అత్యంత ప్రేక్షకాదరణ పొందింది. ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో డిస్కవరీ నెట్‌వర్క్‌పై ఈ మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమం ప్రసారమైంది. రజనీకాంత్‌తో చిత్రీకరించిన కార్యక్రమం ఎప్పుడు ప్రసారమవుతుందనే వివరాలు ఇంకా వెల్లడించలేదు.