తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రజనీ​ రూ.50లక్షలు.. విక్రమ్ రూ.30 లక్షల విరాళం - rajnikanth donates 50 lakhs

కరోనా కట్టడిలో భాగంగా తమిళనాడు ప్రభుత్వానికి అండగా నిలిచారు సూపర్​స్టార్​ రజనీకాంత్​. రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల విరాళం ప్రకటించారు. హీరో విక్రమ్ కూడా రూ.30 లక్షలు అందజేశారు.

Actor Rajinikanth handed over Rs 50 lakhs for COVID relief fund to Tamil Nadu Chief Minister MK Stalin at the secretariat
రజనీకాంత్

By

Published : May 17, 2021, 2:19 PM IST

Updated : May 17, 2021, 2:47 PM IST

కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు సెలబ్రిటీలు. వారికి తోచిన సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే సూపర్​స్టార్​ రజనీకాంత్​ కూడా బాధితులకు అండగా నిలిచారు. తమిళనాడు ప్రభుత్వ సహాయనిధికి రూ. 50లక్షల విరాళం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎంను కలిసి ఈ విరాళాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు సహా ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటించాలని కోరారు. హీరో విక్రమ్ కూడా రూ.30 లక్షల చెక్​ను సీఎంకు అందజేశారు.

విక్రమ్

అంతకు ముందు రజనీ కుమార్తె సౌందర్య ఫ్యామిలీ రూ. కోటి విరాళం, సూర్య, ఆయన సోదరుడు కార్తి రూ.కోటి, చియాన్ విక్రమ్ రూ.30 లక్షలు, హీరోలు అజిత్‌, దర్శకుడు మురుగదాస్‌ చెరో రూ.25 లక్షలు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు.

ఇదీ చూడండి: రజనీ కుమార్తె సౌందర్య రూ.కోటి విరాళం

Last Updated : May 17, 2021, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details