సినీ పరిశ్రమలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఆదివారం కరోనా బారినపడ్డారు. జలుబు, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా స్వల్ప లక్షణాలతో కొవిడ్ నిర్ధరణ అయ్యింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన రాజేంద్రప్రసాద్.. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. రాజేంద్రప్రసాద్ ఆరోగ్యం పూర్తిగా నిలకడగానే ఉందని, అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.
విష్ణు విశాల్‌కు పాజిటివ్..
తమిళ యువ హీరో విష్ణు విశాల్‌కు కూడా వైరస్ సోకింది. 2022ను 'పాజిటివ్' రిజల్ట్‌తో మొదలుపెడుతున్నట్లు ట్విట్టర్లో వెల్లడించాడు ఈ హీరో. తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కొద్దిగా జ్వరం ఉందని తెలిపారు. తనను ఇటీవలే కలిసిన వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
అరిజిత్ సింగ్..
స్టార్ సింగర్ అరిజిత్ సింగ్ వైరస్ బారినపడ్డారు. తనతో పాటు తన భార్యకు కొవిడ్ పాజిటివ్‌గా తేలిందని ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. ఇంట్లో ఐసొలేషన్‌లో ఉన్నామని, ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
వీరికి కూడా..