తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'డార్లింగ్ ఇదేంటి అన్యాయం... గంధర్వులలో కలిసిపోయారా' - Spb latest updates

డార్లింగ్ ఎందేంటి అన్యాయం.. చాలా అన్యాయం ఇది. ఘంటశాల గారే తొందరగా వెళ్లిపోయారనుకుంటే మీరు కూడా గంధర్వులలో కలిసిపోయారా? చాలా అన్యాయం ఇది. అంటూ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్.. ఎస్పీబీ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

'డార్లింగ్ ఎందేంటి అన్యాయం... గంధర్వులలో కలిసిపోయారా'
'డార్లింగ్ ఎందేంటి అన్యాయం... గంధర్వులలో కలిసిపోయారా'

By

Published : Sep 25, 2020, 4:15 PM IST

లేడీస్ టైలర్ సినిమాకు డార్లింగ్ పాటను పాడిన ఎస్పీబీ.... ఆ పాట అనంతరం తనకు కొన్ని వందల పాటలు పాడారని గుర్తు చేసుకున్నారు సినీనటుడు రాజేంద్ర ప్రసాద్. తన చిత్రాల్లో ఎన్నో మరుపురాని పాటలు పాడిన బాలు... ఇంత త్వరగా వెళ్లిపోతారని ఊహించలేదని రాజేంద్ర ప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు.

" మనిషి జీవితంలో రెండే గుర్తుంటాయి. ఒకటి పెళ్లి, రెండు చావు. ఈ రెండింటికి సంబంధించిన అద్భుతమైన పాటలు నాకు పాడారు. మమ్మల్ని వీడి వెళ్లడం నాకు అస్సలు నచ్చలేదు."

--- రాజేంద్ర ప్రసాద్, సినీనటుడు

'డార్లింగ్ ఇదేంటి అన్యాయం... గంధర్వులలో కలిసిపోయారా'

ఇదీ చూడండి: బాలు లాంటి సింగర్ మళ్లీ పుట్టడం కష్టం!

ABOUT THE AUTHOR

...view details