కరోనా బారినపడి అనారోగ్యానికి గురైన సినీనటుడు రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రి వెల్లడించింది. క్లిష్ట పరిస్థితుల నుంచి ఆయన బయటపడ్డారని ఆస్పత్రి డైరెక్టర్ రత్నకిశోర్ పేర్కొన్నారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
నిలకడగా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి - టాలీవుడ్లో కరోనా
కరోనాతో పోరాడుతున్న హీరో రాజశేఖర్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్ రత్నకిశోర్ వెల్లడించారు. ఆయన్ని వైద్యులు నిరంతం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
నటుడు రాజశేఖర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్
రాజశేఖర్ సతీమణి జీవిత కూడా కరోనాతో ఇక్కడే చేరారని, చికిత్స అనంతరం మరోసారి పరీక్షించగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. శనివారం ఆమెను ఇంటికి పంపించనున్నట్లు స్పష్టం చేశారు. రాజశేఖర్‌ను వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, చికిత్సకు ఆయన స్పందిస్తున్నట్లు రత్నకిశోర్ వివరించారు.