తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాజశేఖర్​కు ప్లాస్మాథెరపీ.. నిలకడగా ఆరోగ్యం - నిలకడగా రాజశేఖర్ ఆరోగ్యం

సినీ నటుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రి వెల్లడించింది. ఆయనకు వెంటిలేటర్ చికిత్స ఆపేశామని.. ప్లాస్మా థెరపీ అందించామని తెలిపింది.

Actor rajaskehar health condition is stable
రాజశేఖర్​కు ప్లాస్మాథెరపీ.. నిలకడగా ఆరోగ్యం

By

Published : Oct 27, 2020, 3:39 PM IST

కరోనా బారినపడి అనారోగ్యానికి గురైన సినీనటుడు రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రి వెల్లడించింది. క్లిష్ట పరిస్థితుల నుంచి ఆయన బయటపడ్డారని పేర్కొంది. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

రాజశేఖర్ హెల్త్ అప్​డేట్

"ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. ఆయనకు వెంటిలేటర్ చికిత్స నిలిపివేశాం. ప్లాస్మా థెరపీ అందించాం. ట్రీట్​మెంట్​కు స్పందిస్తున్నారు. ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం."​

-ఆస్పత్రి వర్గాలు

రాజశేఖర్ సతీమణి జీవిత కూడా కరోనాతో ఇదే ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం మరోసారి పరీక్షించగా నెగిటివ్ రిపోర్ట్ రావడం వల్ల శనివారం ఆమెను డిశ్చార్జ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details