తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పేద కళాకారుల విషయంలో నటుడు రాజశేఖర్ మంచి మనసు - కరోనా మరణాలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇండస్ట్రీలోని పేద కళాకారులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు నటుడు రాజశేఖర్. తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారికి నిత్యావసర వస్తువులు అందించాలని నిర్ణయించాడు.

పేద కళాకారుల విషయంలో నటుడు రాజశేఖర్ మంచి మనసు
నటుడు రాజశేఖర్

By

Published : Mar 22, 2020, 7:40 PM IST

కరోనా ప్రభావంతో అన్ని రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సినిమా షూటింగ్​లు, థియేటర్లు ఇప్పటికే మూసివేశారు. అయితే ఈ పరిణామం వల్ల సినీ రంగానికి చెందిన పలువురు పేద కళాకారులు రోడ్డున పడ్డారు. ఇప్పుడు వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు నటుడు రాజశేఖర్. రానున్న పదిరోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను వారికి అందించాలని నిర్ణయం తీసుకున్నాడు.

రాజశేఖర్ జీవిత దంపతులు

'ఇండస్ట్రీలో ఉన్న కొందరు నిరుపేద కళాకారులకు పదిరోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను రాజశేఖర్ ఛారిటబుల్ ట్రస్ట్​ ద్వారా అందజేయనున్నాం. 9010810140 ఫోన్​ నంబర్​కు తమ పూర్తి వివరాలు అందించి తగు సాయం పొందొచ్చు' -రాజశేఖర్-జీవితా రాజశేఖర్

తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈనెల 31 వరకు థియేటర్లు, షూటింగ్​లు అన్ని బంద్ చేశారు. తెలంగాణలో ఈనెల చివరి వరకు లాక్​డౌన్ ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details