టాలీవుడ్ హీరో రాజశేఖర్ కుటుంబమంతా ఇటీవల కరోనా బారిన పడింది. వారిలో తన ఇద్దరు కూతుళ్లు మహమ్మారి నుంచి కోలుకున్నారని రాజశేఖర్ భార్య జీవిత ఇటీవలే తెలిపారు. ప్రసుతం ఆస్పత్రిలో తన భర్తతో పాటు ఆమె చికిత్స పొందుతున్నారు. అయితే రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంచెం క్లిష్టంగా మారిందని ట్వీట్ చేసిన ఆయన కుమార్తె శివాత్మిక.. ఆ వెంటనే తన తండ్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.
'వదంతులు నమ్మకండి.. నాన్న ఆరోగ్యం స్థిరంగా ఉంది'
ఇటీవల కరోనా బారిన పడిన టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి కాస్త క్లిష్టంగా మారిందని ఆయన కుమార్తె శివాత్మిక ట్విట్టర్లో వెల్లడించారు. కానీ కొద్దిసేపటికే తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని అభిమానులంతా ప్రార్థన చేయాలని ఆమె కోరారు.
ఆందోళనకరంగా నటుడు రాజశేఖర్ ఆరోగ్యం!
"నాన్న ప్రస్తుతం కొవిడ్‌తో తీవ్రంగా పోరాడుతున్నారు. మాపై మీరు చూపించిన ప్రేమ మమ్మల్ని రక్షించిందని నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలనే అభిమానుల ప్రార్థనలు ఫలించాలని కోరుకుంటున్నాం" అని ట్విట్టర్లో శివాత్మిక పేర్కొన్నారు. మరొక ట్వీట్లో తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా లేదని.. చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. తన తండ్రి కోలుకోవడానికి అభిమానులు ప్రార్థనలు చేయాలని శివాత్మిక కోరారు.
Last Updated : Oct 22, 2020, 11:10 AM IST