తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పండగ వేళ నటుడు రాజశేఖర్​ ఇంట్లో విషాదం - movie news

దీపావళి రోజు సీనియర్ నటుడు రాజశేఖర్​ ఇంట్లో విషాదం. ఆయన తండ్రి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.

actor rajasekhar father died
రాజశేఖర్ న్యూస్

By

Published : Nov 4, 2021, 10:21 PM IST

దీపావళి పండగ వేళ సినీ నటుడు రాజశేఖర్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి వరదరాజన్‌ గోపాల్‌ (93) మరణించారు. గతకొంతకాలగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ, గురువారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

వరదరాజన్‌ చెన్నై డీసీపీగా చేసి రిటైర్‌ అయ్యారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. రాజశేఖర్‌ ఆయనకు రెండో సంతానం. వరదరాజన్‌ భౌతికకాయాన్ని శుక్రవారం, చెన్నై తీసుకెళ్లనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

వరదరాజన్ గోపాల్

ABOUT THE AUTHOR

...view details