ప్రముఖ నటుడు రాజశేఖర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నామని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కరోనా బారిన పడ్డ రాజశేఖర్ కుటుంబం - నటుడికి కరోనా
తన కుటుంబానికి కరోనా సోకిందని చెప్పిన సీనియర్ కథానాయకుడు రాజశేఖర్.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఇంటికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
"నాకు, జీవితకు, మా ఇద్దరు కుమార్తెలు శివానీ, శివాత్మికకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందన్న వార్తలు నిజమే. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాం. ఇద్దరు కుమార్తెలు పూర్తిగా కోలుకున్నారు. నేను, జీవిత కాస్త అనారోగ్యంతో ఉన్నాం. త్వరలోనే ఇంటికి చేరుకుంటాం. ధన్యవాదాలు" అని రాజశేఖర్ ట్వీట్ చేశారు.
'గరుడవేగ' సినిమా నుంచి రాజశేఖర్ బిజీగా ఉన్నారు. ఆయన ద్విపాత్రాభినయం చేసిన 'అర్జున్' సినిమాను వేసవిలో విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో రాజశేఖర్ సరసన మరియం జకారియా నటించారు. కన్మణి దర్శకుడు. నట్టి కరుణ, నట్టి క్రాంతి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు.