ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు, నటుడు రాజా పెళ్లి జరిగింది. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి దర్శకులు త్రివిక్రమ్, క్రిష్, వంశీ, నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఘనంగా సిరివెన్నెల తనయుడి వివాహం
టాలీవుడ్ నటుడు రాజా వివాహం.. హైదరాబాద్‌లో జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నటుడు రాజా వివాహం
'ఫిదా', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', 'మిస్టర్ మజ్ను', 'హ్యాపీ వెడ్డింగ్', 'అంతరిక్షం', 'రణరంగం' సినిమాల్లో సహాయ నటుడిగా మెప్పించారు రాజా. పలు చిత్రాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్‌ల్లోనూ కీలకపాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నారు.
ఇది చదవండి:ఇది 2020 కాదు.. టాలీవుడ్ పెళ్లిళ్ల సీజన్