'2022. ఇదే నా చివరిది. ఇకపై సినిమాలు చేయను' అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) ట్వీట్ సోషల్ మీడియాలోనే కాదు, చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు దీనిపై రామకృష్ణ స్పందించాడు.
"జోక్ చేశానంతే. భారీ రెమ్యునరేషన్, విలాసవంతమైన జీవితం, ఎన్నో ప్రయోజనాలు వస్తుంటే ఎందుకు కాలదన్నుకుంటాను. నేను రిటైర్మెంట్ ప్రకటించానని నా స్నేహితులు ఫోన్ చేసి మరీ చెప్పటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది" అని రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారు.