తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Lovestory movie: 'సాయిపల్లవి కోసం 20 సార్లు సినిమా చూశా' - sai pallavi dance movie

సాయిపల్లవి(sai pallavi dance movie) డ్యాన్స్​కు తాను ఫిదా అయ్యానని చెప్పారు నటుడు రాహుల్​. ఆమె నృత్యం చూడటానికే 'లవ్​స్టోరీ'ని(lovestory success meet) థియేటర్లో 20సార్లు చూసినట్లు తెలిపారు.

saipallavi
సాయిపల్లవి

By

Published : Sep 29, 2021, 5:06 PM IST

నాగచైతన్య-సాయిపల్లవి(sai pallavi dance in love story) జంటగా నటించిన ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రం 'లవ్‌స్టోరీ'(lovestory success meet). శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈసినిమాలో సాయిపల్లవి డ్యాన్స్‌కు ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ తారలు కూడా ఫిదా అయిపోయారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన నటుడు రాహుల్‌.. సాయిపల్లవిని ఆకాశానికి ఎత్తేశారు. ఆమె డ్యాన్స్ చాలా బాగుందన్నారు. కేవలం ఆమె డ్యాన్స్‌ చూడటానికే 20సార్లు థియేటర్‌కు వెళ్లినట్లు చెప్పారు.

"కేవలం సాయిపల్లవి(sai pallavi dance movie) డ్యాన్స్‌తోనే ఓ పూర్తిస్థాయి సినిమాను ఎవరైనా తెరకెక్కిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆ సినిమాకు ఎటువంటి కథ అవసరం లేదు. సాయిపల్లవి డ్యాన్స్‌ కోసమే 20 సార్లు థియేటర్‌లో 'లవ్‌స్టోరీ'(lovestory movie relese date) చూశాను" అని రాహుల్‌ రవీంద్రన్‌ ట్వీట్‌ చేశారు. కాగా, ఆయన చేసిన ట్వీట్‌పై సాయి పల్లవి ఆనందం వ్యక్తం చేశారు. ఆయన ప్రశంసలు తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు. కుల వ్యవస్థ, అమ్మాయిలపై కుటుంబసభ్యులే ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారనే సున్నితమైన విషయాన్ని శేఖర్‌ కమ్ముల ఈ సినిమాలో చూపించారు. శ్రీవేంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమైంది. రాజీవ్‌ కనకాల, ఈశ్వరీ, దేవయానీ, ఉత్తేజ్‌ కీలకపాత్రలు పోషించారు.

ఇదీ చూడండి: మా ప్రయాణం ఆగిపోతుందనే బాధ కలిగింది: నాగచైతన్య

ABOUT THE AUTHOR

...view details