మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 10న జరిగే ఈ ఎన్నికల కోసం అధ్యక్ష అభ్యర్థులగా మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్ పోటాపోటీగా తలపడుతున్నారు. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్ ప్రకటించగా.. తాజాగా విష్ణు ప్యానల్ నుంచి ఓ కీలక నటుడి పేరు బయటకు వచ్చింది.
MAA Elections: 'మా' ఎన్నికల బరిలో రఘుబాబు - MAA Elections
పలు సినిమాల్లో హాస్య, సీరియస్ పాత్రలతో మెప్పించిన రఘుబాబు.. మా ఎన్నికల బరిలో ఉన్నారు. మంచు విష్ణు ప్యానల్(manchu vishnu panel list) తరఫున ఆయన పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రఘుబాబు
నటుడు రఘుబాబు ప్రధాన కార్యదర్శి పదవి కోసం విష్ణు ప్యానల్ నుంచి పోటీలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఆయన జనరల్ సెక్రటరీగా విజయం సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు, జనరల్ సెక్రటరీ పదవి కోసం ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి జీవిత పోటీ పడతుండగా, బండ్ల గణేశ్ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.
ఇవీ చదవండి: