తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జోర్డాన్​లో చిక్కుకున్న మలయాళ టాప్ హీరో - పృథ్వీరాజ్ సుకుమారన్ న్యూస్

58 మందితో చిత్రీకరణ కోసం జోర్డాన్​ వెళ్లిన మలయాళ చిత్రబృందం కరోనా లాక్​డౌన్​ కారణంగా అక్కడే చిక్కుకుంది. దీనిపై భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని నాన్​ రెసిడెంట్​ కేరళైట్స్​ వ్యవహారాల విభాగాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ఆదేశించారు.

Actor Prithviraj, Director Blessy stranded in Jordan, amid film shoot
జోర్డాన్​లో చిక్కుకున్న మలయాళ నటుడు పృథ్వీరాజ్​

By

Published : Apr 1, 2020, 12:27 PM IST

మలయాళ నటుడు పృథ్వీరాజ్​ హీరోగా బ్లెస్సీ దర్శకత్వంలో 'ఆదు జీవితం' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రబృందం షూటింగ్ కోసం జోర్డాన్​ వెళ్లింది. కానీ కరోనా నేపథ్యంలో అక్కడ లాక్​డౌన్ విధించారు. ఫలితంగా వారు ఆ దేశంలోనే చిక్కుకున్నారు. ఈ విషయమై నాన్​ రెసిడెంట్​ కేరళైట్స్​ వ్యవహారాల విభాగం(నోర్కా) జోర్డాన్​లోని భారత రాయబార కార్యాలయాన్ని గత శుక్రవారం సంప్రదించింది.

ప్రస్తుత పరిస్థితి గురించి జోర్డాన్​లోని భారత రాయబార కార్యాలయానికి తెలియజేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ నోర్కా కార్యదర్శిని ఆదేశించారు. దీనిపై స్పందించిన దౌత్య కార్యాలయం.. చిత్రబృందం క్షేమసమాచారలపై నిర్మాతలను అడిగి తెలుసుకుంది. లాక్​డౌన్​ ముగిసే వరకు అక్కడే ఉండి చిత్రీకరణ చేయాలని భావించిన చిత్రయూనిట్​కు సహకరిస్తామని హామీ ఇచ్చింది.

'ఆదు జీవితం' సినిమాకు బ్లెస్సీ దర్శకత్వం వహిస్తుండగా.. పృథ్వీరాజ్​ ప్రధానపాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ మలయాళ రచయిత బెన్యామిన్​ రాసిన నవల ద్వారా అదే పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రస్తుతం జోర్డాన్​లో జరుగుతున్న షూటింగ్​కు​ తాత్కాలిక విరామాన్నిచ్చింది చిత్రబృందం. ఈ విషయంపై తన ఫేస్​బుక్​లో వివరణ ఇచ్చాడు పృథ్వీరాజ్​.

నా క్షేమం కోరుకున్న వారికి ధన్యవాదాలు

ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ పనిచేయాలని.. ఈ సమయంలో పరిశుభ్రతతో కరోనాను ఎదుర్కోవచ్చని పృథ్వీరాజ్ అన్నాడు. ఈ పరిస్థితిలో తన భద్రత కోరుకున్న వారందరికి కృతజ్ఞతలు తెలిపాడు.

ఇదీ చూడండి.. కుటుంబంతో కలిసి 'రామయణం' చూసిన 'రాముడు'

ABOUT THE AUTHOR

...view details