టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన డ్రగ్స్ కేసుపై 'మా' ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. భావితరాలను నాశనం చేసే మత్తు పదార్థాలని ఉపేక్షించవద్దని కోరారు. డ్రగ్స్ కేసులో దోషులుగా తేలితే ఎంతటి వారినైనా శిక్షించాల్సిందేనన్నారు. 'మా' ప్యానెల్‌లో ఉన్న తనీశ్‌పై వచ్చినవి ఆరోపణలు మాత్రమేనని, ఒకవేళ అవి రుజువైతే ఎవరినైనా శిక్షించాల్సిందేనని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.
Drugs Case: డ్రగ్స్ వివాదంపై ప్రకాశ్‌రాజ్ కీలక వ్యాఖ్యలు - మూవీ న్యూస్
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో చర్చనీయాంశంగా మారిన డ్రగ్స్ కేసు గురించి ప్రకాశ్‌రాజ్ మాట్లాడారు. దోషులుగా తేలితే ఎంతటివారికైనా శిక్ష తప్పదని అన్నారు.
ప్రకాశ్‌రాజ్
'మా' అధ్యక్ష ఎన్నికలకి పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్ తాజాగా తన ప్యానెల్ వివరాల్ని ప్రకటించారు. డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఈ క్రమంలో ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్ విచారణకి శుక్రవారం హాజరైంది. దాదాపు 6 గంటల పాటు ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మిలను ఈడీ విచారించింది. ఈ నెల 17న తనీశ్ విచారణకు హాజరుకానున్నారు.
ఇది చదవండి: MAA Elections: ప్రకాశ్‌రాజ్ ప్యానెల్లోకి జీవిత, హేమ