తెలంగాణ

telangana

ETV Bharat / sitara

MAA Election: 'మా' ఎన్నికల్లో ప్రకాశ్​ రాజ్​ ప్యానల్​ ఇదే! - ప్రకాష్​ రాజ్​ మా ఎన్నికలు

మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికల రూపంలో తెలుగు సినీ పరిశ్రమలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అధ్యక్ష పోటీలో బరిలోకి దిగుతున్నట్లు నటుడు ప్రకాశ్‌ రాజ్‌(Prakash Raj), మంచు విష్ణు(Manchu Vishnu), నటీమణులు జీవితా రాజశేఖర్‌(Jeevitha Rajasekhar), హేమ (Hema) ప్రకటించారు. దీంతో 'మా'లో చతుర్ముఖ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాశ్‌ రాజ్‌ తన ప్యానల్‌ (Prakash Raj Panel)సభ్యుల వివరాలను ప్రకటించారు. మొత్తం 27 మందితో ఈ జాబితాను విడుదల చేశారు.

Actor Prakash Raj announced his panel contesting in MAA election
MAA Election: 'మా' ఎన్నికల్లో ప్రకాశ్​ రాజ్​ ప్యానల్​ ఇదే!

By

Published : Jun 24, 2021, 3:11 PM IST

Updated : Jun 24, 2021, 6:46 PM IST

తెలుగు నటీనటుల సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేయనున్నట్లు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) అధికారికంగా ప్రకటించారు. 27 మందితో కూడిన తన కార్యవర్గ సభ్యుల జాబితాను వెల్లడించారు. 'సినిమా బిడ్డలం' పేరుతో మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించిన ప్రకాశ్ రాజ్.. మా శ్రేయస్సు దృష్ట్యా నిర్మాణాతక ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నారు. పదవుల కోసం కాకుండా పనిచేసేందుకు మాత్రమే 'మా' ఎన్నిక(MAA Elections)ల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన అన్నారు. తన ప్యానల్​లో గతంలో అధ్యక్ష పదవికి పోటీపడి పరాజయం పాలైన జయసుధ కూడా ఉండటం విశేషం. అయితే ఎన్నికల్లో పోటీ పడనున్న ప్రకాశ్​ రాజ్​ ప్యానెల్​లో ఎవరున్నారో చూద్దాం. ​

ఎన్నికల్లో పోటీ చేయనున్న ప్రకాశ్​ రాజ్​ ప్యానల్​

1. ప్ర‌కాశ్​ రాజ్‌

2. జ‌య‌సుధ‌

3. శ్రీకాంత్‌

4. బెన‌ర్జీ

5. సాయి కుమార్‌

6. తనీష్‌

7. ప్ర‌గ‌తి

8. అన‌సూయ‌

9. స‌న

10. అనిత చౌద‌రి

11. సుధ‌

12. అజ‌య్‌

13. నాగినీడు

14. బ్ర‌హ్మాజీ

15. ర‌విప్ర‌కాష్‌

16. స‌మీర్‌

17. ఉత్తేజ్

18. బండ్ల గణేశ్​

19. ఏడిద శ్రీరామ్‌

20. శివారెడ్డి

21. భూపాల్‌

22. టార్జ‌ాన్‌

23. సురేశ్​ కొండేటి

24. ఖ‌య్యుం

25. సుడిగాలి సుధీర్

26. గోవింద‌రావు

27. శ్రీధ‌ర్‌రావు

వీరితో పాటు మ‌రికొంద‌రు ప్ర‌ముఖుల‌తో.. 'మా' ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకాశ్​ రాజ్​ ప్రకటించారు. సెప్టెంబరులో మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా ప్రకాశ్‌ రాజ్‌ మాట్లాడుతూ.. "త్వరలో జ‌ర‌గ‌బోయే ఎన్నికలను పురస్కరించుకుని 'మా' శ్రేయ‌స్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టే దిశ‌గా మా ప్రతిష్ట కోసం.. మ‌న న‌టీనటుల బాగోగుల కోసం.. 'మా' టీంతో రాబోతున్న విష‌యాన్ని తెలియ‌ప‌రుస్తున్నా" అని పేర్కొన్నారు. ప‌ద‌వులు కాదు ప‌నులు మాత్రమే చేయ‌డం కోసం ఈ ఎన్నికల్లో బరిలో దిగుతున్నా అని ప్రకాశ్​ రాజ్​ తెలిపారు.

ఇదీ చూడండి:MAA Elections: 'మా' ఎన్నికల్లో బాలకృష్ణ?

Last Updated : Jun 24, 2021, 6:46 PM IST

ABOUT THE AUTHOR

...view details