తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సీటీమార్​' సక్సెస్.. గోపీచంద్​కు ప్రభాస్​ విషెస్ - సీటీమార్​పై ప్రభాస్ రియాక్షన్

గోపీచంద్​ హీరోగా తెరకెక్కిన చిత్రం 'సీటీమార్'(Seeti Maar Telugu Movie)​.. ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటుడు ప్రభాస్(Prabhas Actor) ఇన్​స్టా వేదికగా​ ఓ పోస్ట్​ చేశారు. గోపీచంద్​ బ్లాక్​ బస్టర్ హిట్​ కొట్టారని అన్నారు.

seeti maar
సీటీమార్

By

Published : Sep 12, 2021, 11:02 AM IST

గోపీచంద్, తమన్నా ప్రధానపాత్రల్లో సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం 'సీటీమార్'. వినాయక చవితి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్​తో ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ సక్సెస్​పై స్పందించారు రెబల్​స్టార్ ప్రభాస్. బ్లాక్​బస్టర్​ కొట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

"సీటీమార్​'తో నా మిత్రుడు బ్లాక్​బస్టర్ హిట్​ కొట్టాడు. చాలా సంతోషంగా ఉంది. కొవిడ్​ రెండో వేవ్​ తర్వాత థియేటర్​ వేదికగా పెద్ద సినిమాను విడుదల చేసే ధైర్యం చేసిన చిత్ర యూనిట్​ను మెచ్చుకోవాలి" అంటూ ప్రభాస్ రాసుకొచ్చారు.

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 'రాధేశ్యామ్', 'సలార్' చిత్రాలతో పాటు 'ఆదిపురుష్'లో హీరోగా నటిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details