తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎన్టీఆర్ గ్యారేజ్​లో కొత్త కారు.. భలే ఉందిగా! - తారక్ రామ్ చరణ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్​ కొత్త కారు ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. లంబోర్గినీ కంపెనీకి చెందిన ఈ లేటెస్ట్ మోడల్ కారు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

tarak
తారక్

By

Published : Jul 23, 2021, 8:20 PM IST

Updated : Jul 23, 2021, 9:08 PM IST

జూనియర్ ఎన్టీఆర్‌కు కార్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఆయన గ్యారేజీలో పలు కార్లుండగా.. లంబోర్గినీ కంపెనీకి చెందిన లేటెస్ట్‌ మోడల్‌ కారు ఇటీవల ఆ జాబితాలో చేరింది. అయితే అది ఎలా ఉంటుందో అని ఎదురుచూసిన తారక్‌ అభిమానులకు ఆ సర్‌ప్రైజ్‌ అందింది.

తారక్‌ కారుని చూడగానే ఓ అభిమాని క్లిక్‌మనిపించి సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం నెట్టింట ఆ కారు ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. నారింజ రంగులో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రామ్‌చరణ్‌ ఇంటికి ఈ కారులో తారక్​ వెల్లగా, ఆయన అభిమానులు క్లిక్‌మనిపించారు.

ఎన్టీఆర్ కొత్త కారు
ఎన్టీఆర్ కొత్త కారు

చెర్రీ, తారక్‌ కలిసి ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో నటిస్తున్నారు. కొమురం భీంగా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ కనిపించనున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అక్టోబరు 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది పూర్తయ్యాక కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు ఎన్టీఆర్‌. తమిళ దర్శకుడు శంకర్‌తో ఓ చిత్రం చేయనున్నారు రామ్‌ చరణ్‌.

ఇవీ చూడండి: ఇన్​స్టాపురములో అందాల కుందనపు బొమ్మలు!

Last Updated : Jul 23, 2021, 9:08 PM IST

ABOUT THE AUTHOR

...view details