రోడ్డు ప్రమాదం జరగడానికి ముందు సాయిధరమ్ తేజ్(saidharam tej accident) తన ఇంటి నుంచే బయలుదేరాడని నటుడు నరేశ్ తెలిపారు. తన కుమారుడు నవీన్ విజయ కృష్ణకు సాయితేజ్ మంచి స్నేహితుడని చెప్పారు. సాయి వేగంగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుడిని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు నరేశ్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.
"సాయిధరమ్ తేజ్ నా బిడ్డలాంటివాడు. తను కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. నా కుమారుడు నవీన్ విజయ కృష్ణ-సాయి మంచి స్నేహితులు. అన్నదమ్ముల్లా ఉంటారు. నిన్న సాయంత్రం వాళ్లిద్దరూ ఇక్కడి నుంచే బయలుదేరారు. బైక్‌పై స్పీడ్‌గా వెళ్లొద్దని చెప్పాలనుకుని బయటకు వచ్చేసరికే.. వాళ్లు బయలుదేరిపోయారు. నాలుగు రోజుల క్రితం కూడా వీళ్లిద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలనుకున్నాను. కానీ కుదరలేదు. పెళ్లి-కెరీర్‌తో జీవితంలో సెటిల్ కావాల్సిన వయసు ఇది. ఇలాంటి సమయంలో ఈ విధమైన రిస్క్‌లు తీసుకోకుండా ఉండటమే మంచిది. గతంలో నేను కూడా బైక్ డ్రైవింగ్‌కు వెళ్లి ప్రమాదానికి గురయ్యాను. మా అమ్మ ఒట్టు వేయించుకోవడంతో ఆనాటి నుంచి బైక్స్ జోలికి పోలేదు. ఆస్పత్రికి వెళ్లి పరామర్శించాలనుకున్నాను. కాకపోతే పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లలేకపోతున్నాను. త్వరలోనే కలుస్తాను"
-నరేశ్, సీనియర్ నటుడు.