కథానాయకుడు నాని దర్శకుడు కావాలనే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. కొన్ని చిత్రాలకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అనుకోకుండా 'అష్టాచమ్మా'తో కథానాయకుడిగా మారాడు. ఎంత ఎత్తుకి ఎదిగినా తరచూ తాను సహాయ దర్శకుడిగా ఉన్న రోజుల్ని గుర్తు చేసుకుంటుంటాడు నాని. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తారో లేదో కానీ, తెరపై మాత్రం దర్శకుడిగా సందడి చేయనున్నట్టు తెలిసింది.
తెరపై 'దర్శకుడి'గా నేచురల్ స్టార్.. - నాని దర్శకుడిగా
సహాయ దర్శకుడి నుంచి కథానాయకుడుగా మారిన నటుడు.. నాని. త్వరలో పట్టాలెక్కనున్న ఓ సినిమాలో అతడు మళ్లీ 'దర్శకుడి' పాత్రలో అలరించబోతున్నట్లు తెలుస్తోంది!
తెరపై 'దర్శకుడి'గా కనువిందు చేయనున్న నాని!
ప్రస్తుతం 'టక్ జగదీష్'లో నటిస్తున్న నాని పలు కొత్త చిత్రాలకి పచ్చజెండా ఊపారు. త్వరలోనే పట్టాలెక్కనున్న ఓ సినిమాలో నాని సినీ దర్శకుడి పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. సహాయ దర్శకుడిగా నిజ జీవిత పాత్రని ఆయన ఇదివరకు 'మజ్ను' సినిమాలో చేశారు. అందులో అగ్ర దర్శకుడు రాజమౌళి దగ్గర సహాయ దర్శకుడిగా కనిపించారు. 'గ్యాంగ్‌లీడర్'లో పెన్సిల్ పార్థసారథి అనే రచయితగా కనిపించి నవ్వులు పంచాడు.