లాక్డౌన్కు ముందే సింహభాగం చిత్రీకరణను పూర్తి చేసుకున్న సినిమాలన్నీ ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. సడలింపుల తర్వాత రంగంలోకి దిగిన చిత్రబృందాలు అడుగడుగునా జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ కొనసాగిస్తున్నాయి. గతంతో పోలిస్తే.. కొవిడ్ వల్ల పని వేగం తగ్గినా, ఎట్టకేలకు సినిమాల్ని ముగింపు దశకు తీసుకొస్తున్నారు.
జోరుగా 'టక్ జగదీష్' చిత్రీకరణ - ఐశ్వర్య రాజేష్
నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న 'టక్ జగదీష్' సినిమా చిత్రీకరణ వేగంగా పూర్తవుతోంది. ఇప్పటికే చిత్ర నిర్మాణం అంతిమ దశకు చేరినట్లు చిత్రబృందం వెల్లడించింది.
ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న 'టక్ జగదీష్' కూడా వడివడిగా చిత్రీకరణని పూర్తి చేసుకుంటూ, చివరి షెడ్యూల్‌లోకి అడుగు పెట్టింది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి చిత్రీకరణ మొదలైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందని చిత్రబృందం తెలిపింది.