పేరు విజయ్‌వర్మ. కానీ.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఆయన్ని అందరూ వైల్డ్‌డాగ్ అని పిలుస్తారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అయిన వర్మ ఆపరేషన్ మొదలు పెడితే చాలు.. అది విజయవంతమైనట్టే. మరి ఈసారి వైల్డ్‌డాగ్ హిమాలయాలకు ఎందుకు వెళ్లాడు? అక్కడ ఆపరేషన్ ఎలా సాగిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
హిమాలయాల్లో 'వైల్డ్.. నాగ్' ఆపరేషన్ - వైల్డ్‌డాగ్ పిక్చర్స్
అక్కినేని నాగార్జున కథానాయకుడిగా, దర్శకుడు అహిసోర్ 'వైల్డ్‌డాగ్' చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. హిమాలయాల్లో చిత్రీకరణ జరుగుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫొటోను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు నాగ్.
‘వైల్డ్..నాగ్’ ఆపరేషన్
నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం ‘వైల్డ్‌డాగ్’. అహిసోర్ సాల్మన్ దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం హిమాలయాల్లో యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. అక్కడ తన చిత్ర బృందంతో కలిసి తీసుకున్న ఫొటోను నాగార్జున గురువారం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇక్కడ స్వేచ్ఛను, ప్రకృతిని ప్రేమిస్తున్నానంటూ నాగార్జున వ్యాఖ్య చేశారు.
ఇదీ చదవండి-పునర్నవిది నిశ్చితార్థమా? లేదా ప్రచారమా?