సినీ నిర్మాత, నటుడు మంచు మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకలు.. అభిమానుల సమక్షంలో శుక్రవారం ఫిలింనగర్‌లోని ఆయన నివాసం వద్ద ఘనంగా జరిగాయి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి చెందిన సినీ కార్మికుడు, మోహన్ బాబు అభిమాని వెంకటేష్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సుమారు 200 మంది కోలాటం కళాకారులతో నిర్వహించిన ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది.
అభిమానుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు - telangana news
సినీ నటుడు మంచు మోహన్ బాబు జన్మదిన వేడుకలు అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఆయన అభిమాని వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. పుట్టిన రోజు సందర్భంగా 200 మంది కళాకారులతో కోలాటం నిర్వహించారు.
![అభిమానుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు mohan babu birthday celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11070606-391-11070606-1616138175323.jpg)
మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకలు
మోహన్‌బాబు నివాసం నుంచి ఫిలిం ఛాంబర్ వరకు కోలాటం నిర్వహించారు. అనంతరం ఫిలిం ఛాంబర్‌లో 100 కేజీల కేక్‌ను కట్ చేశారు.