'మా' ఎన్నికలు(maa elections 2021 results) ముగిసిన తర్వాత కూడా కొద్దిరోజులుగా ఆ వాడివేడి కనిపిస్తూనే ఉంది. మంచు విష్ణు(manchu vishnu panel), ప్రకాశ్ రాజ్(prakash raj panel) ఏమి మాట్లాడినా అది రాద్ధాంతంగా మారుతోంది. ప్రకాశ్ రాజ్, నాగబాబు రాజీనామాను ఆమోదించనని విష్ణు అంటుండగా.. విష్ణును ఈ రెండేళ్లు నిద్రపోనివ్వనంటూ వ్యాఖ్యలు చేశారు ప్రకాశ్ రాజ్(పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి). వీరితో పాటు ఇరు ప్యానెల్ సభ్యులూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఇదే విషయమై స్పందించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma movies).
ఆర్జీవీకి మంచు మనోజ్ స్ట్రాంగ్ కౌంటర్ - రామ్ గోపాల్ వర్మ మా ఎన్నికలు
'మా' సభ్యులపై కామెంట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma movies)కు గట్టిగా బదులిచ్చారు నటుడు మంచు మనోజ్. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
మనోజ్
'మా' సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఆర్జీవీ(ram gopal varma movies).. 'మా' ఒక సర్కస్ అని.. అందులోని సభ్యులు జోకర్లు.. అంటూ ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కాస్తా వైరల్‌గా మారగా.. దీనికి గట్టిగా బదులిచ్చారు నటుడు మంచు మనోజ్(manchu manoj wife). ''మా' సర్కస్ అయితే మీరు అందులో రింగ్ మాస్టర్' అంటూ రిప్లై ఇచ్చారు. దీనిని అభిమానులు, నెటిజన్లు రీట్వీట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
ఇవీ చూడండి
ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ రాజీనామాలు అందలేదు: విష్ణు
బన్నీ-స్నేహ రొమాంటిక్ వీడియో.. ఫ్యాన్స్ ఫిదా!
Last Updated : Oct 19, 2021, 3:53 PM IST