.
నటుడు మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు కన్నుమూత - super star mahesh babu
22:13 January 08
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్‌బాబు కన్నుమూత
21:44 January 08
మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు కన్నుమూత
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌బాబు (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా రమేశ్‌బాబు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
'అల్లూరి సీతారామరాజు' (1974) చిత్రం ద్వారా వెండితెర ప్రవేశం చేశారు రమేశ్‌బాబు. కృష్ణ, మహేశ్‌బాబుతో కలిసి పలు సినిమాల్లో నటించారు. సుమారు 15 చిత్రాల్లో నటించారు. 1997 నుంచి నటనకు దూరంగా ఉన్న రమేశ్‌బాబు 2004 లో నిర్మాతగా మారారు. 'అర్జున్', 'అతిథి' సినిమాలు నిర్మించారు.
ఇదీ చూడండి:ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ కన్నుమూత