తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రతన్‌టాటా బయోపిక్‌పై మాధవన్‌ క్లారిటీ - Actor Madhavan denied he is in Ratan Tata biopic

రతన్​టాటా బయోపిక్ రానుందని.. అందులో మాధవన్ నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై స్పందించిన ఈ సఖీ హీరో.. ఇందులో నిజం లేదని స్పష్టం చేశారు.

Ratan Tata biopic
రతన్‌టాటా

By

Published : Dec 13, 2020, 8:27 AM IST

Updated : Dec 13, 2020, 8:36 AM IST

అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరైన రతన్‌టాటా బయోపిక్‌పై గత కొంతకాలంగా సినీవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల 'ఆకాశం నీ హద్దురా'తో భారీ హిట్​ అందుకున్న డైరెక్టర్‌ సుధా కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు వినిపించాయి. అందులో మాధవన్‌ రతన్‌టాటాగా కనిపించనున్నారని వినికిడి. అయితే దీనిపై స్పందించారు సఖీ హీరో.

'మాధవన్‌.. మీరు రతన్‌ టాటా బయోపిక్‌ సినిమాలో ప్రధానపాత్ర పోషిస్తున్నారట. ఇది నిజమేనా.? ఒకవేళ ఈ వార్త నిజమైతే ఎంతమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది' అని ఓ అభిమాని పోస్టు చేశాడు. దానికి ఓ పోస్టర్‌ను కూడా జత చేశాడు. అందులో మాధవన్‌ అచ్చం రతన్‌టాటాలా కనిపిస్తున్నారు. అయితే.. ఈ పోస్టర్‌పై మాధవన్‌ స్పందించారు. "దురదృష్టవశాత్తు ఇది నిజం కాదు. కొంతమంది అభిమానుల కోరిక మాత్రమే. ఇంతవరకూ అలాంటి ప్రాజెక్టు గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు" అని స్పష్టం చేశారు.

కాగా, సూర్య హీరోగా ఆకాశం నీ హద్దురా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్‌ సుధా కొంగర తన తర్వాతి ప్రాజెక్టు గురించి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.

ప్రస్తుతం మాధవన్‌ నటించిన 'మారా' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌ 17న ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి : అభిమానికి మాధవన్​ క్షమాపణలు.. ఎందుకంటే?

Last Updated : Dec 13, 2020, 8:36 AM IST

ABOUT THE AUTHOR

...view details