తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కార్తికేయకు కాబోయే భార్య గురించి తెలుసా? - కార్తికేయ లోహితా రెడ్డి ఎంగేజ్​మెంట్

యువ నటుడు కార్తికేయ నిశ్చితార్థం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే ఆయన మనువాడబోయే అమ్మాయి ఎవరా? అని ఆరాతీయడం మొదలుపెట్టారు అభిమానులు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు కార్తికేయ.

Kartikeya
కార్తికేయ

By

Published : Aug 23, 2021, 9:46 PM IST

యువ నటుడు కార్తికేయ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ఆయన నిశ్చితార్థం వైభవంగా సాగింది. ఈ విషయం తెలియగానే.. కార్తికేయ మనువాడబోయే ఆ అమ్మాయి ఎవరా? అని ఆయన అభిమానులు ఆరా తీయడం ప్రారంభించారు. తాజాగా ఆ సంగతుల్ని కార్తికేయ బయటపెట్టారు.

ఆమె పేరు లోహిత. వరంగల్‌ ఎన్‌.ఐ.టి.లో చదువుతున్నప్పుడు (2010) ఇద్దరికీ పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు ఏడడుగుల బంధం కాబోతుంది. "నా స్నేహితురాలే భార్యగా నా జీవితంలోకి వస్తుందనే విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2010 నుంచి మాకు పరిచయం ఉంది. లోహితని తొలిసారి వరంగల్ ఎన్‌.ఐ.టి.లో కలిశా" అని కార్తికేయ తన మనసులో మాట పంచుకున్నారు.

'ఆర్‌ఎక్స్‌ 100' చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు పొందిన కార్తికేయ ఇటీవల 'చావు కబురు చల్లగా' సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం 'రాజా విక్రమార్క' సినిమాలో నటిస్తున్నారు. అజిత్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న తమిళ చిత్రం 'వాలిమై'లో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.

ఇవీ చూడండి: బిస్లరీ వాటర్​తో స్టార్ హీరోయిన్ స్నానం

ABOUT THE AUTHOR

...view details